పేదల పెన్నిధి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ఆంధ్రప్రదేశ్ కీ జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి

విశాఖ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేద‌ల పెన్నిధి అని ఎమ్మెల్యే తిప్ప‌ల నాగిరెడ్డి కొనియాడారు. మంగ‌ళ‌వారం  87 వార్డు గణేష్ నగర్ -02 సచివాలయం పరిధిలో వార్డు ఇంచార్జ్ కోమటి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కీ జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి  పాల్గొని, పార్టీ జెండాని ఆవిష్కరించారు. గత నాలుగున్నరేళ్ల వై.యస్.ఆర్.సీ.పీ పాలనలో, గణేష్ నగర్ -02 సచివాలయం పరిధిలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని సూచించే డిజిటల్ డిస్-ప్లే బోర్డు ను ఆవిష్కరించారు.

సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డి  పనిచేస్తున్నారని, అందుకే ప్రజలందరూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కీ జగనే ముఖ్యమంత్రి గా రావాలని కోరుకొంటున్నార‌ని ఎమ్మెల్యే అన్నారు. గణేష్ నగర్-02, సచివాలయం పరిధిలో, డీ.బీ.టి , నాన్ డీ.బీ.టి ద్వారా 21 కోట్ల సంక్షేమ ప‌థ‌కాల రూపంలో అందించామ‌న్నారు.

పార్టీ నాయకులు, సచివాలయం కన్వీనర్స్, వాలంటీర్లు, గృహసారధులు ఇంటింటికి తిరుగుతూ, వై.యస్.ఆర్.సీ.పీ పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని వివరించే బుక్-లెట్లు, కరపత్రాలను అందజేశారు.

 కార్యక్రమంలో జె.సీ.యస్ క్లస్టర్ ఇంచార్జ్ వాడపల్లి రామచంద్ర రాజు, గాజువాక క్లస్టర్-4, మండల అధ్యక్షులు బొడ్డ గోవింద్, ప్రగడ వెణుబాబు, కోమటి రమాదేవి, శీరపు పాపారావు, వడ్లపూడి ఈశ్వరావు, కోనేటి పారిపాల్లి, జెర్రిపోతుల ఈశ్వరావు, శృంగవరపు బ్రాహ్మిణి, దుగ్గపు దానప్పలు, ఆడారి శ్రీను, బోండా గోవిందరాజు,దాక కృష్ణ, ప్రగడ శ్రీనివాస్,ప్రగడ గోవిందరాజులు, కణితి నగేష్, చేకూరి హరీష్ వర్మ, పసుపులేటి రంగారావు,బొడ్డు సుమంత్, కర్రీ అంజి, కాండ్రేగుల మనోహర్, ఆర్.పీ లు, వాలంటీర్లు, గృహ సారధులు, పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top