లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన విప్‌ సామినేని

అమరావతి: వరద నీరు దిగువకు విడుదల చేశామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, గుంటూరు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ సూచించారు.  పులిచింతల ప్రాజెక్టును ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్‌ మంగళవారం సందర్శించారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని వదిలారు. వరద నీరు రావడంతో పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు. రెస్క్యూటీమ్‌లను సిద్ధం చేయించారు. ముంపు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. మాచవరం మండలంలోని ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత పారంతాలకు తరలించారు. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. గుంటూరు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌..0863 2324014, తెనాలి ఆర్డీవో ఆఫీస్‌లో కంట్రోల్‌ రూమ్‌: 08644 223800 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ శ్యాముల్‌ ఆనంద్‌ తెలిపారు. 
 

Back to Top