కేసులకు భ‌య‌ప‌డం..ప్ర‌జాక్షేత్రంలో తేల్చుకుంటాం

చంద్ర‌బాబు పాల‌న‌లో భ్ర‌ష్టు ప‌డుతున్న పోలీస్ వ్య‌వ‌స్థ‌

అక్ర‌మ అరెస్ట్‌ల‌ను ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ్తాం

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు 

నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డిపై అక్ర‌మ కేసులు పెట్ట‌డం సిగ్గుచేట‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి,మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, ప్ర‌తాప్‌కుమార్ రెడ్డిలు అన్నారు.  ఇంటెలిజెన్స్ డీఎస్పీ చెప్పిన‌ట్లు కింద‌స్థాయి సిబ్బంది ప‌నిచేస్తున్నార‌న్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పోలీస్ వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తోంద‌న్నారు.అధికార పార్టీకీ తొత్తుల‌గా వ్య‌వ‌హ‌రించే ఉద్యోగులు ఇబ్బంది ప‌డ‌తార‌న్నారు. వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిప‌రుల‌ను భ‌యబ్రాంతుల‌కు గురిచేస్తున్నార‌న్నారు.అక్ర‌మ అరెస్ట్‌లు ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ్తామ‌న్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డిపై పోలీసుల వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రికాద‌న్నారు. అధికారులు తీరు మార్చుకోకుంటే భ‌విష్య‌త్‌లో ఇబ్బందిప‌డ‌తార‌న్నార‌న్నారు.టీడీపీ నేత‌లు అక్ర‌మాల‌కు అధికారులు అండ‌గా నిలుస్తున్నార‌న్నార‌ని మండిప‌డ్డారు.  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయిస్తున్నార‌న్నారు. కేసుల‌కు భ‌య‌ప‌డ‌మ‌ని ప్ర‌జాక్షేత్రంలో తేల్చుకుంటామ‌ని తెలిపారు.

Back to Top