వైయ‌స్ఆర్‌సీపీతోనే  సంక్షేమ రాజ్యం..

వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న కోసం ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు..

ఆత్మీయ స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు..

వైఎస్‌ఆర్‌ జిల్లా: రాష్ట్రం లో మళ్లీ వైయ‌స్‌ పాలనను చూడాలంటే మనమందరం కలిసిమెలసి పార్టీ కోసం కృషి చేయాలని రాజంపేట మాజీ ఎంపీ మిథున్ రెడ్డి,  రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి  పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే తమ ప్రధాన ఎజెండాగా పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు, బూత్‌ కన్వీన ర్లు, సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ అలుపె రుగని పాదయాత్ర చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కష్టనష్టాలను తెలుసుకున్నారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూర్చారని వివరించారు. ఈ అయిదేళ్ల టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని విమర్శించారు. ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ పాలనను చూడాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం సమష్టి కృషి చేయాల్సి ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌కు ఓటు వేసి, వేయించి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు తమవంతు కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలు, బూత్‌ కన్వీనర్లు, ప్రతి ఒక్కరికి ఆయన సూచించారు.సమావేశంలో రైతు విభాగం జిల్లా ఫ్రధాన కార్యదర్శి వై నారాయణరెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ బీసీ సెల్‌ ప్రెసిడెంట్‌ పసుపులేటి సుధాకర్, అన్ని గ్రామ పంచాయతీల్లోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్‌ కన్వీనర్లు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top