గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం

విజ‌య‌వాడ‌: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి లండన్‌ పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా గ‌న్నవరం ఎయిర్‌పోర్టులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఘ‌న‌ స్వాగతం పలికారు. సీఎంకు స్వాగ‌తం ప‌లికిన వారిలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, పినిపే విశ్వరూప్, సీఎస్ డాక్టర్ కె.ఎస్. జవహర్‌రెడ్డి, డీజీపీ కే. వీ. రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Back to Top