బాల వికాస కేంద్రాలు మరిన్ని ఏర్పాటు చేస్తాం

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
 

తాడేపల్లి: మరిన్ని బాల వికాస కేంద్రాల ఏర్పాటుకు కృషిచేస్తున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఏపీలో ప్రస్తుతం 115 బాల వికాస కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బాల వికాస కేంద్రాలు హిందూ ధర్మ రణకు దోహదపడతాయన్నారు. మరిన్ని నిర్మించేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన వివరించారు. అదే విధంగా రాష్ట్రంలో 500 దేవాలయాలు నిర్మించామని చెప్పారు. కృష్ణా జిల్లా దళిత వాడల్లో 55 దేవాలయాలు నిర్మించామన్నారు. దళితులకు వేదం, మంత్ర పఠనం నేర్పిస్తున్నామన్నారు. అదే విధంగా చదువు రాని పెద్దలకు విద్య నేర్పేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అంతేకాకుండా ప్రతి నెలా ధర్మిక సదస్సులు నిర్మిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. 
 

తాజా ఫోటోలు

Back to Top