వలస కూలీలను స్వస్థలాలకు చేరుస్తాం

సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని

తూర్పుగోదావరి: వలస కూలీలను స్వస్థలాలకు పంపించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తోందని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. వలస కూలీల కోసం ప్రత్యేకంగా షెల్టర్లు, వసతులు ఏర్పాటు చేశామన్నారు. అందరినీ శ్రామిక్‌ రైల్‌లో స్వస్థలాలకు పంపుతామని వివరించారు. వలస కూలీలు పడే బాధలను చూసి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని, నిర్దిష్ట దూరంలో భోజనం, తాగునీరు వలస కూలీలకు అందేలా చూడాలని సీఎం ఆదేశించారని గుర్తుచేశారు. నడుచుకుంటూ వెళ్తున్న వారిని గుర్తించి ఆయా రాష్ట్రాలతో మాట్లాడి కూలీలను స్వస్థలాలకు పంపించాలని సీఎం ఆదేశించారని మంత్రి పేర్ని నాని చెప్పారు. 

Back to Top