కోనాపురం చెరువుకు హంద్రీనీవా నీరు విడుదల

అనంతపురం: కోనాపురం చెరువుకు హంద్రీనీవా నీటిని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత విశ్వేశ్వరరెడ్డి విడుదల చేశారు. హంద్రీనీవా నీటితో ఉరవకొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. రోబోయే రోజుల్లో హంద్రీనీవా ద్వారా నియోజకవర్గంలో అన్ని చెరువులకు నీటిని అందిస్తామన్నారు. కోనాపురం చెరువుకు నీటిని విడుదల చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Back to Top