ఉక్రెయిన్ విద్యార్థుల‌కు ఘ‌న స్వాగ‌తం

గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్‌లో స్వాగ‌తం ప‌లికిన స్లోవేకియా ప్ర‌తినిధి ర‌త్నాక‌ర్‌
 

విజ‌య‌వాడ‌: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ద నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాలలోకి వచ్చిన విద్యార్థుల‌ను వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం క్షేమంగా రాష్ట్రానికి తీసుకువ‌స్తోంది. ఉక్రెయిన్ నుంచి ఏపీకి వ‌చ్చిన విద్యార్థుల‌కు శ‌నివారం గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టులో ఘ‌న స్వాగ‌తం ప‌లికింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌ర‌ఫున స్లోవేకియా ప్ర‌తినిధి, వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు పండుగాయ‌ల ర‌త్నాక‌ర్‌, అధికారులు ఎయిర్ పోర్టులో విద్యార్థుల‌కు స్వాగ‌తం ప‌లికి, వారి యోగ‌క్షేమాలు తెలుసుకున్నారు.  విద్యార్థుల‌ భద్రత కోసం  ముఖ్య మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి  చూపిన చొరవకు  విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top