నెల్లూరు న‌గ‌రంలో `గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం`

ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాద‌వ్‌కు ఘ‌న స్వాగ‌తం
 

నెల్లూరు: నెల్లూరు నగరంలోని 47వ డివిజన్ కామాటివీధి, తదితర ప్రాంతాలలో   గడప గడపకు మన ప్రభుత్వం 27వ రోజు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాద‌వ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రికి ప్ర‌తి వీధిలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఎదురెళ్లి అనిల్‌కుమార్‌ను క‌లిసి త‌మ‌కు అందుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి  తెలియ‌జేస్తున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అండా నిల‌వాల‌ని, మీ ఆశీస్సులు ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. అలాగే స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Back to Top