వైయస్ఆర్ జిల్లా: జిల్లాలో ఒక్క రోజు పర్యటనలో భాగంగా సోమవారం ఇడుపులపాయ, పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు గన్నవరం నుంచి బయలుదేరి ఉదయం 10.22 గంటలకు కడప విమానాశ్రయం కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఘన స్వాగతం లభించింది. కడప విమానాశ్రయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్. బి. అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు, నగర మేయర్ కె. సురేష్ బాబు, ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ మళ్ళికార్జున రెడ్డి, ఎమ్మెల్సీలు పి. రామ సుబ్బారెడ్డి, ఎం. రామచంద్రా రెడ్డి, డి.సి. గోవిందరెడ్డి, రమేష్ యాదవ్, ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామిరెడ్డి, దాసరి సుధ, మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, సుధీర్ రెడ్డి ఇతర నాయకులు అధికారులు, తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆప్యాయంగా అందరిని పేరుపేరున పలకరించి పులివెందుల లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఉదయం 10.41 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు.