వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో అభివృద్ధి పరుగులు

మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ 

 నెల్లూరు: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం నెల్లూరు న‌గ‌రం 54వ డివిజన్‌లో సచివాలయాన్ని మంత్రి అనిల్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నెల రోజుల్లో నెల్లూరు సిటీలో 13 పార్కులను ప్రారంభించబోతున్నాము. ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే పనులు చేస్తున్నాము.

టీడీపీ ఆరోపణలు పచ్చ కామెర్ల సామెతను గుర్తు చేస్తున్నాయి. నోరుంది కదా అని ఇంగిత జ్ఞానం లేకుండా మట్లాడుతున్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో కమీషన్లకు కక్కుర్తిపడ్డ టీడీపీ నేతలకు మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. సినిమా రిలీజ్‌కి కటవుట్‌ కట్టాలని చిల్లర దండుకునే బ్యాచ్‌ టీడీపీది. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా అభివృద్ధి ఆగదు' అని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. 

Back to Top