ఓటర్లను చంపుతామని బెదిరిస్తున్నారు..

మంత్రి సునీతకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు

రామగిరి మండలంలోకి అనుమతించకపోవడం అప్రజాస్వామికం

ఈసీ దృష్టికి మంత్రి పరిటాల సునీత దౌర్జన్యాలు

వైయస్‌ఆర్‌సీపీ రాప్తాడు అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి

అనంతపురం: మంత్రి  పరిటాల సునీత దౌర్జన్యాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లామని రాప్తాడు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు.నాలుగున్నరేళ్లుగా రామగిరి మండలంలోకి తమను అనుమతించకపోవడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి పరిటాల సునీతకు కొందరు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.పరిటాల శ్రీరామ్‌కు ఓటు వేయకపోతే చంపుతామని ఓటర్లను బెదిరిస్తున్నారని తెలిపారు.గూండాలను ప్రోత్సహిస్తూ ప్రజలను భయపెట్టి గెలవాలనుకుంటున్నారన్నారు.

 

Back to Top