ఓటు ఫ‌ర్ ఫ్యాన్‌

అనంత‌పురంలో విస్తృతంగా వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ప్ర‌చారం 

 అనంతపురం: అనంతపురం నగరంలోని  17 వ డివిజన్ ఎన్నికల నేపథ్యంలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగవినుతను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి అంటూ నేడు రుద్రంపేట పంచాయతీ సర్పంచ్ సుగాలి పద్మావతి ఉపసర్పంచ్ శ్రీ నరేంద్రరెడ్డి, రూరల్ మండలం వైస్ ఎంపీపీ బాలాజీ , వైస్సార్సీపీ నాయకులు రామచంద్ర రెడ్డి , రమణ రెడ్డి  , సుధీర్ రెడ్డి  , ఆదినాయక్ , సాధిక్ , రహమతుల్లా , బెస్త నాగరాజు ,రాంమూర్తి  , గోవింద్  , నాగరాజు, నాగార్జున, సుధాకర్, వరదరాజులు, ఆది, సునీల్ అజాం, తదితర ముఖ్య నాయకులతో కలిసి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి నాగవినుత   ఇంటింట ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..గతంలో ఎన్నడూ లేని విదంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్  సహకారంతో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి  సారధ్యంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు.  17వ డివిజన్ కు సంబంధించి 15వ తేదీ న జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు మరోమారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగవినుత ను అత్యధిక మెజారిటీ తో గెలిపించి అభివృద్ధి లో భాగస్వామ్యులు అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రుద్రంపేట పంచాయతీ వైస్సార్సీపీ నాయకులు, వార్డు సభ్యులు, వైస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top