ప్రతిధ్వనించిన సామాజిక సాధికార స్వరం

సామాజిక సాధికారతను సాధించి చూపిన నేత సీఎం వైయ‌స్ జగన్‌: ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా

బలహీన వర్గాలకు ఆత్మవిశ్వాసమిచ్చిన జగనన్న: మంత్రి ఉషశ్రీచరణ్‌

బడుగుల ఆత్మబంధువు సీఎం వైయ‌స్ జగన్‌: మంత్రి గుమ్మనూరు జయరామ్‌

పేదల బాధలు చూసి చలించిపోయే కరుణామయుడు సీఎం జగన్‌: ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

మాట తప్పని, మడమ తిప్పని నాయకులు వైయ‌స్ జ‌గ‌న్‌: ఎంపీ గోరంట్ల మాధవ్‌

హిందూపురం: హిందూపురం నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర దిగ్విజయంగా సాగింది. అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద జరిగిన బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అడుగడుగునా సామాజిక సాధికారత ప్రతిధ్వనించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు అంజాద్‌ బాషా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే శంకరనారాయణ తదితరులు పాల్గొన్నారు. సభలో వక్తలు ఏమన్నారంటే....

ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా మాట్లాడుతూ....

– భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, సామాజిక సాధికారత అన్నది ఒక నినాదంగా ఉంటూ వస్తోంది.
– సామాజిక సాధికారతను నిజం చేసి చూపిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. మైనార్టీనైన నన్ను ఉపముఖ్యమంత్రిని చెయ్యడం వైయ‌స్ జ‌గ‌న్‌కే సాధ్యమైంది.
– కేబినెట్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులున్నారు. నలుగురు ఉపముఖ్యమంత్రులు ఈ వర్గాల వారే. 
– బీసీలంటే బ్యాక్‌బోన్‌ క్లాస్‌లని చెప్పిన గొప్ప నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి.
– మైనార్టీలు పడుతున్న కష్టాలు నాడు వైయస్సార్‌ గుర్తించారు. 4 శాతం రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం మైనార్టీ పిల్లలకు ఎంతో మంచి చేసింది. 
– ఈరోజు ఆయన తనయుడిగా జగనన్న, మైనార్టీలను చెయ్యిపట్టుకుని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్నారు.
– నలుగురు మైనార్టీలను శాసనమండలిలో చోటు కల్పించారు జగనన్న.
– రూ.2.35 లక్షల కోట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు డీబీటీ ద్వారా అందించారు.

మంత్రి ఉషాశ్రీచరణ్‌ మాట్లాడుతూ...

– గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా కులాలకు అతీతంగా, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతివారికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 
– పేదలకు సైతం ఫ్యామిలీ డాక్టర్‌ను అందుబాటులోకి తెచ్చిన ఘనత జగనన్నది. 
– అందరికీ మేలు జరగాలంటే మనకు ముఖ్యమంత్రిగా జగనన్నే ఉండాలి.
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలందరూ జగనన్న వెంటే నడవాలి. 56 కార్పొరేషన్లద్వారా 136 కులాలకు న్యాయం చేయాలని సంకల్పించిన జగనన్న.
– బీసీలలో కులగణనకు శ్రీకారం చుట్టిన జగనన్న. వారికి మరింత మంచి జరగాలనే కోరుకుంటున్నారు. 
– వెనుకబడిన కులాలకు, మహిళలకు గౌరవం ఇచ్చే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం.

మంత్రి గుమ్మనూరు జయరామ్‌ మాట్లాడుతూ...

– ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది. జగనన్న పాలనలోనే అది సాధ్యమైంది. 
– బడుగు, బలహీనవర్గాలకు ఒక ఆత్మబంధువుగా ఆదుకునే ముఖ్యమంత్రి మనకు ఉన్నారు. 
– బీసీలకు ఎప్పుడైనా చంద్రబాబు పెద్దపీట వేశారా? వాల్మీకినైన నేను ఐదేళ్లపాటు మంత్రిగా ఉన్నానంటే అది జగనన్న వల్లే. 
– వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల మన పేదల పిల్లలు పెద్ద చదువులు చదువుకోగలిగారు. 
– తండ్రి కన్నా ఎక్కువగా మనకు మంచి చేసేందుకు తాపత్రయపడుతున్నారు జగనన్న.
– బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కలిస్తే.. బాలకృష్ణ గిరగిరా తిరిగి పడిపోవాలి. 

రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ....

– ఈరోజు బెంగళూరులో బీసీ నాయకులు కొందరు నన్ను కలిసి.. మా ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
– ఎందుకంటే బీసీ పేదపిల్లలు ఆంధ్రప్రదేశ్‌లో బాగా చదువుకునే అవకాశాలున్నాయి. వారికి మంచి అవకాశాలు వస్తాయి. 
– చదువుకునే పిల్లలకు స్కూలు స్థాయి నుంచి ప్రొఫెషనల్‌ కోర్సుల వరకు ప్రభుత్వం చేయూతనిస్తోంది.
– పేదల బాధలకు చలించిపోయే కరుణామయుడు జగన్‌మోహన్‌రెడ్డి. 
– బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లోనూ వారికోసం.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పథకాలు లేవు. 
– జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయనాయకుడు కాదు సంఘసంస్కర్త. 
– పక్కరాష్ట్రాలకు పోయి చూస్తే.. ఇక్కడ జగనన్న చేస్తున్న మంచి మనకు అర్థమవుతుంది. 

ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ...

– నిజాయితీపరుడు, మాటతప్పని, మడమ తిప్పని నాయకుడు మన జగన్‌మోహన్‌రెడ్డి. ఆత్మగౌరవం కోసం ఢిల్లీని ఢీకొన్న నాయకుడు.
– ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రతి అంచెలోనూ, అధికార పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. 
– చదువుకున్న పిల్లలు ప్రపంచాన్ని జయిస్తారని నమ్మిన ముఖ్యమంత్రి, పేదపిల్లల కోసం  ఎన్నెన్నో మంచి పనులు చేస్తున్నారు. 
– అందరితో సమానంగా, యూనిఫాం, బూట్లతో బడులకెళ్లే పరిస్థితి ఈరోజు మన పిల్లలకు ఉందంటే.. అది జగనన్న వల్లనే. 
– హిందూపురం ప్రజలు ఈసారి ఆలోచించి ఓటెయ్యాలి. 

ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ...

– జగనన్నను 2024లో మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడమే మనందరి కర్తవ్యం. 
– హిందూపురంలో కూడా వైయస్సార్‌సీపీ జెండా ఎగరాలి. 
– ఆరు నెలలకోసారి వచ్చి ముగ్గురిని తిట్టడం, ఇద్దరిని కొట్టి వెళ్లిపోవడం అన్నది ఇప్పటి ఎమ్మెల్యే బాలకృష్ణగారి పనిలా ఉంది. అలాంటి ఎమ్మెల్యే  మనకవసరమా? 
– ఇక చంద్రబాబు చెప్పే అబద్దాల్ని నమ్మకుండా జగనన్న వెంట నడుద్దాం. 
– టీడీపీ అధికారంలో ఉండగా ఎస్సీలకు చేసింది ఏమీలేదు. ఎస్టీలకు చేసింది ఏమీలేదు. బీసీలకు, మైనార్టీలకు చేసింది ఏమీ లేదు. 
– ఆయా వర్గాలను కించపరచడం, దూషించడం, అవమానాల పాలు చెయ్యడం చంద్రబాబు తీరు. మన బలహీనవర్గాలు జగన్‌మోహన్‌రెడ్డికే ఓట్లు వెయ్యాలి.

ఎమ్మెల్యే శంకరనారాయణ మాట్లాడుతూ...
– రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకుని, ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రికి ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. 
– అభివృద్ధి లక్ష్యంతో నా ఎస్సీ,నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్న మాటలకు నిజమైన అర్థం చెప్పిన జగనన్న.
– నాలుగున్నరేళ్ల పాలనలో లంచాలు, వివక్షత లేకుండా, పేద, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జగనన్న.

Back to Top