ఓటుకు కోట్లు కేసులో మ‌రో సంచ‌ల‌నం

వెలుగులోకి 11.30 నిమిషాల వీడియో

రేటు పెంచే విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌స్తావ‌న‌

అమ‌రావ‌తి: ఓటుకు కోట్లు కేసులో మ‌రో సంచ‌ల‌నం వెలుగు చూసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు చంద్ర‌బాబు అప్ప‌టి త‌న పార్టీ నేత రేవంత్‌రెడ్డిని డ‌బ్బు మూట‌ల‌తో పంపించిన విష‌యం అందరికి తెలిసిందే. అయితే అప్ప‌టి ఘ‌ట‌న‌లో రేటు ఫిక్స్ చేసే అంశంపై ఓ వీడియో బ‌య‌ట‌ప‌డింది. ఈ మేర‌కు ఓ జాతీయ మీడియా ఆస‌క్తిక‌ర క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఈ క‌థ‌నం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ వీడియోలో ఏముందంటే..టీడీపీ నేత సెబాస్టియ‌న్‌, టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిఫెన్‌స‌న్ మ‌ధ్య రేటు విష‌యంలో ఒప్పందం గురించిన విష‌యాలు వెలుగు చూశాయి.

టీడీపీ త‌ర‌ఫున నిల‌బ‌డిన ఎమ్మెల్సీకి ఓటు వేస్తే టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిఫెన్‌స‌న్‌కు రూ.3.50 కోట్లు ఇస్తామ‌ని ఒప్పుకున్నార‌ని సెబాస్టియ‌న్ చెబుతూ..ఆ రేటును త‌న ప్ర‌మేయంతో రూ.5 కోట్ల‌కు పెంచుతున్నాన‌ని, ముందు డీల్ ఫినిస్ చేయ‌మ‌ని బాబు చెప్పిన‌ట్లు వీడియో సంభాష‌ణ‌ల్లో వినిపిస్తోంది. 11.30 నిమిషాల నిడివి గ‌ల ఈ వీడియో హాట్ టాఫిక్‌గా మారింది. ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి ఏ విధంగా ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఓ ఎమ్మెల్యేను కొనుగోలు చేసే అంశాలు బ‌య‌ట‌కురావ‌డంతో తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు చంద్ర‌బాబు తీరును అస‌హ్యించుకుంటున్నారు.

Back to Top