పెరిగిన పింఛ‌న్ల పంపిణీ పండ‌గ మొద‌లైంది

కొత్త సంవ‌త్స‌రం రోజు రూ.2,750 పింఛ‌న్ అందుకుంటున్న ల‌బ్ధిదారులు

రాష్ట్ర వ్యాప్తంగా 2,31,989 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు

64,06,240కి చేరుకున్న సామా­జిక పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య

పింఛ‌న్ల పంపిణీ కోసం రూ.1,765 కోట్లు విడుద‌ల చేసిన వైయ‌స్ జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం 

తాడేప‌ల్లి: నూత‌న సంవ‌త్స‌రం రోజు తెల్లవారుజాము నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా పింఛన్ల పండుగ‌ కొనసాగుతుంది. కొత్త సంవత్సరంతో పాటే రాష్ట్రంలో పింఛ‌న్ వారోత్స‌వాలు మొద‌లయ్యాయి. లక్షలాది మంది అవ్వాతాతలు, వితంతు, ఒంటరి మహిళ, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్య­కారులు, చర్మకారులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల ఇళ్ల­లో కొత్త వెలుగులు వచ్చేశాయి. ఇప్పటి వ‌ర‌కు ప్రతి నెలా రూ.2,500 చొప్పున అందుకుంటున్న పింఛను డబ్బులు ఈరోజు నుంచి ప్రతి నెలా రూ.2,750 చొప్పున అందుకుంటారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెంచిన పెన్షన్ మొత్తం 2,750 రూపాయలు వలంటీర్లు ల‌బ్ధిదారుల‌కు అందజేస్తున్నారు. మరోవైపు ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2,31,989 మందికి వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. జనవరి 3వ తేదీన సీఎం వైయ‌స్‌ జగన్‌ రాజమండ్రిలో పింఛను పెంపు వారోత్సవ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని ల‌బ్ధిదారుల‌తో మాట్లాడ‌నున్నారు.  

64.06 లక్షలకు చేరిన పింఛన్ల సంఖ్య
ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 2,31,989 పింఛన్లతో కలిపి జనవరి నెలలో రాష్ట్రంలో సామా­జిక పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 64,06,240కి చేరుకుంది. నేడు జనవరి 1వ తేదీ ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ.. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెరిగిన పింఛను డబ్బులు అంద‌జేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం శనివారమే అన్ని గ్రామ, వార్డు సచివాలయ శాఖల బ్యాంకు ఖాతాల్లో రూ.1,765 కోట్ల నిధులను జమ చేసింది. 

కొత్తగా బియ్యం.. ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలు 
పింఛన్లు రూ.2,750కి పెంపుతో పాటు కొ­త్తగా పెన్షన్, బియ్యం కార్డులు, ఆరో­గ్య­శ్రీ కా­ర్డులు, ఇళ్ల పట్టాలను (జూలై 2022 నుంచి నవంబర్‌ 2022 వరకు) అర్హులైన వారికి మంజూరు కార్డులను వా­రో­త్స­వాల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారు. 44,543 మంది కుటుంబాలకు ప్రభుత్వం కొత్తగా బియ్యం కార్డులు, 14,401 కుటుంబా­లకు కొత్తగా ఆరోగ్యశ్రీ, మరో 14,531 కుటుంబాలకు కొత్తగా ఇళ్ల పట్టా­లను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. వైయ‌స్‌ జగన్ ముఖ్య‌మంత్రిగా బాధ్యతలు చేపట్టిన­ప్పటి నుంచి పింఛన్ల కోసం రూ.62,500 కోట్లు ఖర్చు పెట్టారు. లబ్ధిదా­­రుల సంఖ్య తాజాగా 64.06 లక్షలకు పెరిగింది. పెరి­గిన పింఛన్లపై ఏటా రూ. 21,180 కోట్లు ప్రభుత్వం వ్యయం చేయనుంది. 

తేడాను గ‌మ‌నించండి..
చంద్రబాబు ప్రభుత్వంలో రూ.1,000 ఉన్న పింఛన్‌ను వైయ‌స్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రూ.2,250కు పెంచడంతో పాటు.. 2022 జనవరిలో రూ.2,500కు, ఈ జనవరి నుంచి రూ.2,750కి పెంచుకుంటూ వచ్చారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నెల వారీగా పింఛన్ల పంపిణీకి అరకొరగా రూ.400 కోట్ల చొప్పున పంపిణీ చేయగా, 2019లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పింఛన్ల వ్యయం ఏకంగా మూడున్నర రెట్లు పెంచి రూ.1,350 కోట్లు ఖర్చు చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తే.. వైయ‌స్‌ జగన్‌ సీఎం అయ్యాక సంతృప్త స్థాయిలో అర్హులందరికీ వంద శాతం పింఛన్ల మంజూరు చేసే విధానం తీసుకొచ్చారు. తద్వారా 2019లో 52.17 లక్షలకు, 2022లో 62.31 లక్షలకు, 2023లో 64.06 లక్షలకు ఆ సంఖ్య చేరుకుంది.

తాజా వీడియోలు

Back to Top