తూర్పులో యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

సైకిళ్లను పంపిణీ చేస్తున్న టీడీపీ 

ఆర్డీవోకు వైయస్‌ఆర్‌సీపీ నేత విశ్వరూప్‌ ఫిర్యాదు..

తూర్పుగోదావరి: జిల్లాలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత పినిపే విశ్వరూప్‌ అమలాపురం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.కోడ్‌ అమలులో ఉన్న సైకిళ్లను పంపిణీ చేయడం పట్ల విశ్వరూప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలుగుదేశం పార్టీ నిబంధనలకు పాతరేస్తుందని మండిపడ్డారు. అమలాపురం,రావులపాలెం,గోకవరంలో టీడీపీ నేతలు  సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేయడానికి  సైకిళ్లు ను సిద్ధంగా ఉంచారు. చంద్రబాబు,గంటా స్టికర్లతో భారీ సంఖ్యలో సైకిళ్లు పంపిణీ చేస్తున్నారు.విశ్వరూప్‌ ఫిర్యాదు మేరకు కోడ్‌ ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటామని ఆర్డీవో తెలిపారు

Back to Top