శారద పీఠాన్ని సందర్శించిన సీఎం వైయస్‌ జగన్‌ 

స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న  వైయస్‌ జగన్‌

విశాఖపట్నం: చిన ముషిడివాడ శారద పీఠాన్ని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించారు.వైయస్‌జగన్‌కు  ఆశ్రమ పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. సీఎం హోదాలో తొలిసారిగా విశాఖకు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌ సంప్రదాయ వస్త్రధారణతో పీఠంలోకి అడుగుపెట్టారు. స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంత‌రం రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు.  వైయస్‌ జగన్‌కు అభినందనలు తెలియచేయడానికి పెద్ద ఎత్తున్న వైయస్‌ఆర్‌సీ శ్రేణులు,అభిమానులు,ప్రజలు శారద పీఠానికి చేరుకున్నారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆశా వ‌ర్క‌ర్లు కృత‌జ్ఞ‌త‌లు

పాదయాత్రలో ఇచ్చిన హామీమేరకు ఆశ వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి 10 వేలకు పెంచుతూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై హర్షం వ్యక్తం చేసిన ఆశా వర్కర్లు.. శారదా పీఠాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు..

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top