పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధే ప్రభుత్వ ధ్వేయం

 శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు 

గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌

 అమరావతి : పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి అనే అంశాన్ని ప్రభుత్వం కీలకంగా భావిస్తోందని గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మూడు రాజధానులు ఏర్పాటు శాసన ప్రక్రియలో ఉందని స్పష్టం చేశారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని మరోసారి గుర్తుచేశారు. రాష్ట్ర బడ్జెట్‌పై ప్రసంగంలో గవర్నర్‌ ఈ అంశాన్ని పొందుపరిచారు. 

సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళిలు రచించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పటికే అభివృద్ధిలో దూసుకుపోతున్న విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వెనుకబడిన రాయలసీమకు పూర్వవైభవం తీసుకువచ్చేలా.. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేసి న్యాయ రాజధానిగా గుర్తించాలని సంకల్పించింది. ప్రభుత్వ నిర్ణయానికి ప్రతిపక్ష టీడీపీ నిత్యం  అభ్యంతరం వ్యక్తం చూస్తూ కోర్టులో కేసులు వేస్తున్నా.. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా  మూడు రాజధానులకే ముఖ్యమంత్రి జగన్‌ కట్టుబడి ఉన్నారు. ఈ మేరకు సబంధిత బిల్లుకు రాష్ట్ర శాసనసభ సైతం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top