టీడీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడదాం..

విశాఖ మన్యంలో వైయస్‌ఆర్‌సీపీలోకి భారీ చేరికలు..

విశాఖపట్నం: విశాఖ మన్యంలో వైయస్‌ఆర్‌సీపీ హవా రోజురోజుకు పెరుగుతుంది. పెద్దఎత్తున్న వివిధ పార్టీల నుంచి నేతలు,కార్యకర్తలు పార్టీలోకి చేరుతున్నారు. ముంచంగిపుట్టులో వలసలు భారీగా మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు ఆధ్వర్యంలో టీడీపీ,కాంగ్రెస్,బీఎస్పీలకు చెందిన పలువురు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.భారీ ర్యాలీగా వివిధ పార్టీల నుంచి సుమారు 500  మంది కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది: రవిబాబు

రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత రవిబాబు అన్నారు.చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలను ఏ ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు.ఆదివాసీ ప్రాంతాలలో అసలు టీడీపీ పరిపాలన చేస్తుందా.. లేదా అనే రీతిలో ఉందన్నారు. అన్ని రంగాల్లో కూడా టీడీపీ ప్రభుత్వం ఘోర వైఫల్యాన్ని మూట గట్టుకుందన్నారు. పాలకులు అసత్య ప్రచారాలతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.ఏజెన్సీలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాలేదని, అటవీ ఉత్పత్తులకు సరైన ధర లభించడం లేదన్నారు.కాపీ,మిరియాలు,పిప్పళ్లు,చింతపండు వంటివి సరైన ధర లేక రైతాంగం ఇబ్బందులు పడుతుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే ముందు ఏజెన్సీ రైతుల బాకీలను మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు.

Back to Top