'టీడీపీ ప్రభుత్వ అసమర్థతతోనే విజయవాడ వరద కష్టాలు'

వైయ‌స్ఆర్‌సీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి
 

తాడేపల్లి : విజయవాడ వరదల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం తన అసమర్థతను ప్రదర్శించుకుందనివైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఎక్స్‌ ఖాతాలో ఆయన ట్వీట్‌ చేశారు.

కరోనా లాంటి విపత్తు సమయంలో ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌ ఎంతో సమర్థవంతంగా పని చేశారని ఏపీ మొత్తం ప్రశంసించింది. అలాంటిది ఇప్పుడు విజయవాడ వరదల విషయంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా పని చేసింది. టీడీపీ ప్రభుత్వానికి ప్రజల అవసరాలను సకాలంలో గుర్తించగలిగే సామర్థ్యం(సహానుభూతి-ఎంపథీ) ఏమాత్రం లేదు అని విజయసాయిరెడ్డి  పేర్కొన్నారు.

Back to Top