విజయవాడ: చంద్రబాబు ఓ ఊసరవెల్లి అంటూ వైయస్ఆర్‌సీపీ నాయకుడు, విజయవాడ ఎంపీ కేశినాని నాని విమర్శించారు. ఒంటరిగా గెలిచే సత్తా లేక ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. బుధవారం కేశినేని నాని మీడియాతో మాట్లాడారు.. కేశినేని నాని ఏమన్నారంటే.. దేశంలోనే అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం ముందుంది రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి గద్దె రామ్మోహన్ విఫలమయ్యారు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో దేవినేని అవినాష్ తన దైన ముద్ర వేసుకున్నారు మంచి వాడిగా ముసుగు వేసుకున్న అసమర్థుడు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మోదీ భజన చేసేందుకు టీడీపీ జనసేన నేతలు సిద్ధమయ్యారు ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని బీజేపీ పెద్దలకు చంద్రబాబు తాకట్టు పెట్టాడు పిఠాపురంలో ఓడిపోవటాని పవన్ సిద్ధమయ్యాడు ఓటమి భయంతోనే పవన్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు ,పవన్కు ప్రజాగళం సభలో మోదీని శాలువా తో సత్కరించడం చేతకాలేదు 2024 ఎన్నికల తరువాత టీడీపీ జనసేన పార్టీలు బీజేపీలో విలీనం అయిపోతాయి లోకేష్ కనులన్నల్లోనే టీడీపీ సోషల్ మీడియా నడుస్తోంది అణగారిన వర్గాలకు జగనన్న ప్రభుత్వం భరోసా: దేవినేని అవినాష్ అణగారిన వర్గాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వం భరోసాగా నిలిచిందని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు.. వైయస్ జగన్ పాలనలో అభివృద్ధి సంక్షేమ అందుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతీ ఒక్కరికీ పథకాలు అందించిన ఘనత జగన్ ది తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు ఓటు వేసినా వేయక పోయినా సంక్షేమ పథకాలు అందించాం ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో ప్రజలు ఆలోచించాలి సొంత అజెండా కోసమే బీజేపీతో టీడీపీ ,జనసేన పార్టీలు దోస్తీ కలిశాయి మైనార్టీ లకు వ్యతిరేకంగా గా NRC ,CAA లను తీసుకువచ్చిన బీజేపీకి చంద్రబాబు మద్దతు పలికాడు వైయస్ జగన్ లేకపోతే సంక్షేమ పథకాలకు ఆమడ దూరంగా ఆంధ్ర రాష్ట్రం ఉండేది అణగారిన వర్గాలకు వైయస్ జగన్ ప్రభుత్వం భరోసా కల్పించింది