తాడేపల్లి: విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిలు కాసేపట్లో ప్రారంభించనున్నారు. వర్చువల్ విధానం ద్వారా ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొననున్నారు. రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కిలోమీటర్ల వంతెన పూర్తిచేశారు. కనకదుర్గ ఫ్లైఓవర్‌తో పాటు రాష్ట్రంలో 61 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.15,592 కోట్ల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.