విజయవాడ: దాడిలో గాయపడిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం వైయస్ జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో సీఎం జగన్‌పై దాడి జరిగింది. ఆ రాయి అత్యంత వేగంగా సీఎం వైయస్ జగన్ కనుబొమ్మకు తాకింది. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగింది. అనంతరం వైద్యుల సలహామేరకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి సీఎం వైయస్ జగన్ బయల్దేరారు. కాగా, సీఎం వైయస్ జగన్‌పై జరిగిన దాడిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పందించారు. సీఎం వైయస్ జగన్‌పై దాడిని ప్రధాని ఖండించారు. వైయస్ జగన్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ప్రధాని ఆకాంక్షించారు.