వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ  నేతగా విజయసాయిరెడ్డి

లోక్‌సభలో పార్టీ నేతగా మిథున్‌రెడ్డి
చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

అమరావతి: వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌రామ్‌ ఎంపికయ్యారు. ఈ ముగ్గురినీ ఆయా పదవుల్లో నియమిస్తున్నట్లు వైయ‌స్ఆర్‌సీపీయ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 3న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు. వీరి నియామకాలను అధికారికంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఆయా ప్రభుత్వ శాఖల కమిటీల అధికారులు వీరి నియామకాన్ని గుర్తించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top