చరిత్ర హీనుడిగా మిగిలిపోతావ్ అచ్చం

 వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌
 

విశాఖ‌: పాలనా రాజధాని విశాఖకు అడ్డుపడుతూ.. ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం తలపెడుతున్న టీడీపీపై అక్కడి ప్రజాగ్రహం పెల్లుబిక్కుతోంది. ఈ క్రమంలో వైయ‌స్ఆర్‌ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్యసభ స‌భ్యులు విజయసాయిరెడ్డి.. టీడీపీ సీనియర్‌ నేత అచ్చెన్నాయుడికి ట్విట్టర్‌ ద్వారా చురకలంటించారు.  
ఉత్తరాంధ్రలో టీడీపీ ఒక్క అసెంబ్లీ, లోక్‌సభ స్థానం కూడా గెలవకుండా చేయడానికి నీలాంటి ఒక్కడు చాలు అచ్చం అని వ్యంగ్యం ప్రదర్శించారు విజయసాయిరెడ్డి. ‘టెక్కలిలో నీ ‘టెంకాయ’ ఈసారి ఎలాగూ ముక్కలు అవుతుంది. పాలనా రాజధానిగా వైజాగ్‌ కాకుండా భ్రమరావతి రియల్‌ ఎస్టేట్‌ మాఫియాకు దళారిలా మాట్లాడుతున్నావ్‌. చరిత్ర హీనుడిగా మిగిలిపోతావ్‌’ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top