వైయ‌స్ఆర్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి ( నాలుగు నియోజకవర్గాలు) జిల్లాల రీజనల్ కో- ఆర్డినేటర్‌గా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ముఖ్య‌మంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేరకు రీజనల్ కో-ఆర్డినేటర్‌గా విజ‌య‌సాయిరెడ్డిని నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యా లయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

Back to Top