రాజ్యసభ బీఏసీలో వైయ‌స్ఆర్‌సీపీకి చోటు

బీఏసీ సభ్యుడిగా విజయసాయిరెడ్డికి అవకాశం 

న్యూఢిల్లీ:  రాజ్య‌స‌భ‌లో  నాలుగో అతిపెద్ద పార్టీగా వైయ‌స్ఆర్‌సీపీ అవతరించింది. ఇటీవలే రాజ్యసభలో వైయ‌స్ఆర్‌సీపీ బలం పెరిగిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో కీలకమైన రాజ్యసభ బీఏసీలో వైయ‌స్ఆర్‌సీపీకి చోటు దక్కింది.  బీఏసీలో సభ్యుడిగా విజయసాయిరెడ్డికి స్థానం లభించింది.  ప్రస్తుతం రాజ్యసభలో వైయ‌స్ఆర్‌ సీపీ బలం రెండు నుంచి ఆరుకు పెరిగింది. పార్టీ రాజ్యసభ సభ్యులుగా విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్యరామి రెడ్డి, పరిమళ్ నత్వానీలు ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top