అద్దె ఇల్లు ఖాళీ చేయడానికి అభ్యంతరమేంది?

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వీ విజయసాయిరెడ్డి
 

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్‌ ఒక అక్రమ నిర్మాణమని, కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఈ నివాసం నుంచి చంద్రబాబునాయుడు తక్షణం ఖాళీ చేయాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభపక్ష నేత వీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. ‘చంద్రబాబు ఐదేళ్లుగా నివాసం ఉంటున్న అక్రమ నిర్మాణం లింగంనేని ఎస్టేట్ నుంచి తక్షణం ఖాళీ చేయాలి. అది వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే కట్టారుగా అనే ముర్ఖపు లాజిక్కులతో తప్పించుకోలేరు. నదీ గర్భంలో నిర్మించిన భవనమని తేలాక కూల్చివేయడం తప్ప వేరే పరిష్కారమేముండదు’ అని ఆయన ట్విటర్‌లో స్పష్టం చేశారు. 

దేవినేని ఉమ ఉత్తర కుమారుడు..
మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావుపై విజయసాయిరెడ్డి ట్విటర్‌లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ఉత్తర కుమారుడు ఎలా ఉంటాడో నిన్ను చూస్తేనే తెలుస్తుంది ఉమా! 2018 జూన్‌కల్లా పోలవరంలో నీళ్ళు నిలబెడతాం. రాసుకో సాక్షి పేపర్లో అని ప్రగల్భాలు పలికినప్పుడే ఆ పేరు నీకు స్థిర పడింది. నీ అవినీతి పుట్ట పగిలే టైం వచ్చింది. కాస్త ఓపిక పట్టు..’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top