విజయనగరం: ఉత్తరాంధ్ర నుంచే వైయస్ఆర్‌సీపీ ఎన్నికల శంఖారావం మొదలవుతుందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) తెలిపారు. ఈ నెల 27న భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మీడియా సమావేశంలో మాట్లాడుతూ....సామాజిక న్యాయం ద్వారానే సమా సమాజం స్థాపన జరుగుతుందని నమ్మిన వ్యక్తి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించేలా విజయవాడ నడిబొడ్డున ప్రపంచంలో ఎత్తయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి స్మృతి వనం ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైయస్ జగన్ గారిది అని పేర్కొన్నారు. పండగ వాతావరణంలో రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన జనసంద్రోహం మధ్య 206 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ ఘనంగా జరిగిందని ఈ కార్యక్రమానికి హాజరై దిగ్విజయం చేసిన ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ.. సీఎం వైయస్ జగన్ గారు ఏర్పాటుచేసిన అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రజలందరూ సందర్శించి అంబేద్కర్ భావజాలాన్ని అలవర్చుకోవాలని అన్నారు... ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసి ఎన్నికల శంఖారావం పూరించడానికి సన్నద్ధమయ్యారని తెలుపుతూ.. మొదటిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈనెల 27వ తేదీన భారీ బహిరంగ సభ ద్వారా దిశ నిర్దేశం చేయనున్నారు కావున ఈ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో గల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరవ్వాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పిలుపునిచ్చారు. తొలి బహిరంగ సభ ద్వారా ఉత్తరాంధ్ర కార్యకర్తలు, అభిమానులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తెలిపారు. ప్రతి నియోజవర్గం నుంచి ఆయుదు ఆరు వేల మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్రపై సీఎం వైయస్ జగన్‌కు ప్రత్యేక శ్రద్ద ఉందని.. అందుకే ఈ ప్రాంతం నుంచి ఎన్నికల ఉద్దేశం చేస్తారని తెలిపారు. సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన రాష్ట్రాన్ని అయిదు జోన్‌లుగా విభజించి కేడర్ సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారని చెప్పారు. రెండు నెలల్లో జరిగే ఎన్నికలకు పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరగనున్నట్లు తెలిపారు. ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చేర్చే విధంగా చర్చిస్తారని తెలిపారు. ఇది ఒకరకంగా ఎన్నికల శంఖారావం అనుకోవచ్చన్నారు. ఎన్నికలకు పార్టీని గేరప్ చేసే దిశగా మీటింగులు జరగనున్నాయని చిన్న శ్రీను పేర్కొన్నారు. ‘ఎవరికి ఎమ్మెల్యే..ఎవరికి ఎంపి టికెట్ ఇవ్వాలన్నది సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయిస్తారు. ఈ పార్టీ వ్యక్తుల కోసం కాదు వ్యవస్థ కోసం ఏర్పాటు చేశారు. టికెట్‌లు ఇవ్వలేదన్న భావం మా నేతల్లో లేదు. విశాఖలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా అది వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ తర్వాత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే. రుషికొండలో ఐటీ సెజ్...అచ్యుతాపురం బ్రాండెక్స్ కంపెనీలు వైయస్ఆర్ హయాంలో వచ్చినవే. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్ర విశాఖలో ఏమైనా ప్రాజెక్టులు వచ్చాయా చెప్పండి. టీడీపీ హయాంలో భోగాపురం ఎయిర్ పోర్టు కాంట్రాక్ట్ పనులు రద్దు చేయించారని గుర్తు చేశారు.