42.43 లక్షల మంది విద్యార్థులకు జ‌గ‌న‌న్న విద్యా కానుక‌

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  ఎంపీ విజయసాయిరెడ్డి
 

తాడేప‌ల్లి: జగనన్న విద్యాకానుక పథకాన్ని ఈ నెల 8న సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌ కృష్ణా జిల్లా పునాదిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విటర్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేశారు.

'జగనన్న విద్యాకానుక పథకం ద్వారా 42.34 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. కొత్త సిలబస్‌తో కూడిన పుస్తకాలు, 3 జతల యూనిఫాం, ఒక జత బూట్లు, 2 జతల సాక్స్‌, బెల్ట్‌, నోట్‌బుక్‌లు, స్కూల్‌బ్యాగ్‌ ఇలా వివిధ రకాల వస్తువులని అందిస్తున్నాము. మొదటి తరగతి నుంచి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టారు' అని విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు.  
రాష్ట్రవ్యాప్తంగా 42,34,322 మంది విద్యార్ధులకు దాదాపు రూ.650 కోట్ల ఖర్చుతో ‘స్టూడెంట్‌ కిట్లు’ అందచేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ స్టూడెంట్‌  కిట్లు పంపిణీ చేస్తారు. బాలురకు స్కై బ్లూ రంగు, బాలికలకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందిస్తారు. కోవిడ్‌ నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా పంపిణీ చేస్తారు.

కాగా.. రాష్ట్రంలో విద్యాశాఖకి సీఎం వైయ‌స్ జగన్ అత్యంత ప్రాధాన్యతనిచ్చి జగనన్న గోరుముద్ద, అమ్మఒడి, నాడు-నేడు ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. విద్యాశాఖలో సంక్షేమ పథకాల ద్వారా డ్రాప్ అవుట్స్‌ని తగ్గించడం, ప్రాథమిక స్ధాయి నుంచే అత్యుత్తమ విద్యని అందించడమే లక్ష్యంగా పనిచేస్తుండటం ప్రభుత్వ పనిచేస్తుండటం గమనార్హం. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top