తేడా తెలుసుకో బాబూ..!

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

  అమరావతి : ‘చంద్రబాబూ.. పాలకుడికి, మ్యానిపులేటర్‌కు ఉన్న తేడా ఇదే తెలుసుకో’ అని వైయ‌స్ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీనేత విజయసాయి రెడ్డి సూచించారు. సోమవారం ఆయన ట్విటర్‌ వేదికగా రాష్ట్రాభివృద్ధికి తన సహకారం సదా ఉంటుందని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలపడంతో పాటు చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తారు. 

‘తమ వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ. 6 వేలకు పెంచాలని ధర్నా చేసిన 'ఆశా' అక్కా చెల్లెళ్లపై మహిళా దినోత్సవం రోజునే పోలీసులను ఉసిగొల్పి చంద్రబాబూ అరెస్టు  చేయించాడు. కానీ సీఎం వైయ‌స్‌ జగన్ మాత్రం ముందస్తు హామీ ఇవ్వకున్నా వారి వేతనాలను 300% పెంచుతూ కొత్త ఆశలు నింపారు. పాలకుడికి, మ్యానిపులేటర్‌కి తేడా ఇదే చంద్రబాబూ.’ అంటూ విజయసాయి రెడ్డి చురకలంటించారు.

వైయ‌స్‌ జగన్ కేబినెట్లో 60 శాతం మంత్రులు అణగారిన వర్గాలకు చెందిన వారేనని, దేశంలో దళితులు, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదని విజయసాయి రెడ్డి తెలిపారు. ఇది ఖచ్చితంగా బలహీనవర్గాల ప్రభుత్వమేనని, బీసీలకు 50 శాతం నామినేషన్ పనులు కేటాయించి ఆర్థికంగా ఎదిగేలా చేస్తామని వైయ‌స్ జగన్‌ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

రాష్ట్రాభివృద్ధికి తన సహకారం సదా ఉంటుందని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి విజయసాయి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. స్పెషల్ స్టేటస్‌తో సహా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఆయన తోడ్పాటునిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని, వైయ‌స్‌ జగన్‌ యజ్ఞంలా చేపట్టిన కార్యక్రమాలకు కేంద్రం బాసటగా నిలవాలని ఆకాంక్షించారు. మరో ట్వీట్‌లో శ్రీ వెంటేశ్వర స్వామి దర్శనార్ధం ఆదివారం తిరుమలకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని పద్మావతి అతిధి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఫొటోలను పంచుకున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top