భజనా చౌదరి వెరైటీ ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది

 వైయస్‌ఆర్‌సీపీ విజయసాయిరెడ్డి
 

అమరావతి : ఎంపీ సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ(బీజేపి) వేరు... అందులో ఉన్న బాబు జనాల పార్టీ(బీజేపి) వేరు అని అందరికీ మరోసారి బాగా అర్థమైందని వైయస్‌ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు టచ్‌లో ఉన్నారంటూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ’అవినీతి మీద చంద్రబాబు నాయుడు, ఆకలి మీద లోకేష్ నాయిడు, ఇసుక అక్రమాల మీద అచ్చెం నాయుడు, మహిళా రక్షణ మీద చింతమనేని, సంస్కారం మీద ఉమా, స్పీకర్ పదవి ఔన్నత్యం మీద యనమల లెక్చర్ ఇస్తే ఎలా ఉంటుందో... బ్యాంకు లూటీల భజనా చౌదరి ఏపీ ప్రయోజనాల గురించి ప్రెస్‌మీట్లు పెడితే కూడా అలాగే ఉంటుంది’ అని ఎద్దేవా చేశారు. ‘ఈసారి సుజనా చౌదరి వెరైటీ ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. విలేకర్లను కాకుండా తాను వేల కోట్ల మేర ముంచేసిన అర డజను బ్యాంకుల అధికారుల్ని ఎదుట కూర్చోపెట్టి వారి ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తే... ఆయన పార్టీ ఎందుకు మారాడో, చంద్రబాబు ఆయనను ఎందుకు పార్టీ మార్చాడో అన్నీ అర్ధమవుతాయి’ అని చురకలు అంటించారు.

Read Also: రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా డబ్బు ఆదా అయితే మంచిది కాదా?

తాజా ఫోటోలు

Back to Top