త్వ‌ర‌లోనే విశాఖ నుంచి ప‌రిపాల‌న‌

విశాఖకు త్వరలోనే ఎగ్జిక్యూటివ్‌ రాజధాని వస్తుంది

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి 

 విశాఖపట్నం: విశాఖకు త్వరలోనే ఎగ్జిక్యూటివ్‌ రాజధాని వస్తుందని వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. '' త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ నుంచి పరిపాలన చేస్తాము.సీఆర్టీఏ కేసుతో రాజధాని తరలింపునకు సంబంధం లేదు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు. పంచ గ్రామాల సమస్యపై కోర్టుకు అఫిడవిట్‌ ఇచ్చాం. కోర్టు అనుమతి మేరకు ఇళ్ల యజమానులకు పట్టాలిస్తాం. సింహాచలం భూముల చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తాం. ఏలేరు-తాండవ రిజర్వాయర్‌ అనుసంధానానికి రూ.500 కోట్లు మంజూరు చేయనున్నాం. విశాఖలో ప్రతి వార్డును అభివృద్ధి చేస్తాం'' అని వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి  తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top