విజయనిర్మలకు సీఎం వైయ‌స్ జగన్ ఘన నివాళి

 కృష్ణను పరామర్శించిన వైయ‌స్ జగన్ 
 

హైద‌రాబాద్‌: మొన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూసిన ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల భౌతికకాయానికి ఏపీ సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ ఉదయం ఆమె నివాసానికి వచ్చిన వైయ‌స్ జ‌గ‌న్‌ పుష్పాంజలి ఘటించారు. అనంతరం విజయనిర్మల కుమారుడు నరేశ్ ను సీఎం ఓదార్చారు. ఆదిశేషగిరిరావు తదితరులతో మాట్లాడారు. అనంతరం లోపలికి వెళ్లి కృష్ణను పరామర్శించారు. ఘట్టమనేని కుటుంబ సభ్యులతోనూ వైయ‌స్ జగన్ కొద్దిసేపు మాట్లాడారు. వైయ‌స్ జగన్ వెంట ఎంపీ విజయసాయిరెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.

 

Back to Top