సదావర్తి భూములపై విజిలెన్స్‌ దర్యాప్తు జరిపించాలి

అధికారులపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చి భూములు విక్రయించారు

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

అమరావతిః సదావర్తి భూములపై విజిలెన్స్‌ దర్యాప్తు జరిపించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరారు.అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ దేవాదాయ శాఖ భూములు అమ్మడానికి వీల్లేదని జీవో  ఉందని..కాని అధికారులపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చి భూములు విక్రయించారని తెలిపారు. దేవాదాయ శాఖ భూములు అమ్మాలంటే ప్రభుత్వ అనుమతి ఉండాలన్నారు. వేలం కూడా అన్యాయంగా  జరిగిందని.. ఈ టెండర్లు పిలవకుండానే వేలం వేశారని తెలిపారు. 2018 ఆగస్టులో సదావర్తి భూములను అమ్మేయాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు. తమిళనాడులోని చిన్న పేపర్‌లో వేలం ప్రకటన ఇచ్చారన్నారు.

గుంటూరులోని చంద్రబాబు బినామీలు మాత్రమే వేలంలో పాల్గొన్నారని తెలిపారు.ఎకరం భూమి రూ.50 లక్షలకు ధర నిర్ణయిస్తే రూ.22 లక్షలకే చంద్రబాబు బినామీలు వేలం పాడారని తెలిపారు.వేలం నిర్వహణాధికారి బతిమలాడితే మరో రూ.5 లక్షలు అధికంగా పాడినట్టుగా నోటీసులో రాసుకున్నారన్నారు.కోర్టు తీర్పు ప్రకారం రూ.27 కోట్లు కడితే ఐటి దాడులు చేయిస్తామని నారా లోకేష్‌ నన్ను బెదిరించారని తెలిపారు.
 

తాజా ఫోటోలు

Back to Top