'జగనన్న ఆణిముత్యాలు' విద్యార్థులకు వరం 

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌
 

తూర్పు గోదావ‌రి:'జగనన్న ఆణిముత్యాలు' విద్యార్థులకు వరం లాంటిద‌ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ అన్నారు. రాజ‌మండ్రిలో జగనన్న ఆణిముత్యాల కార్యక్రమంలో ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో 2023లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన‌ విద్యార్థులకు న‌గ‌దు బ‌హుమ‌తులు, షీల్డ్‌లు అందజేశారు.  మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, రుడా చైర్‌ప‌ర్స‌న్‌ మేడపాటి షర్మిళ రెడ్డి, క‌లెక్ట‌ర్ మాధ‌విల‌త చేతుల మీదుగా విద్యార్థుల‌ను సన్మానించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ చిన్న నాటి నుంచి విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలని అన్నారు. మనం సాధించింది పాఠశాలలకు, తల్లిదండ్రులకు మంచి కీర్తిని తెచ్చి పెడుతుందని అన్నారు. జగనన్న ప్రభుత్వంలో ఇలాంటి ప్రోత్సాహకాలు అందించటం ప్రథమమని అన్నారు.  

Back to Top