వెల్లువెత్తిన అభిమానం

వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా వరి కోత ప్ర‌ద‌ర్శ‌న‌
 

బాపట్ల: జననేత వైయ‌స్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా అభిమానం వెల్లువెత్తుతోంది. ఇదిలా ఉంటే.. గత మూడేళ్లుగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజుకి తన అభిమానాన్ని డిఫరెంట్‌గా కనబరిచే వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి.. మరోసారి ప్రత్యేకతను చూపించారు. చుండూరు మండలం వలివేరు పంట పొలాలలో  వైయ‌స్‌ జగన్‌ 175/175 సీట్లు లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ.. వరి కోత ప్రదర్శించారు. 

ఇదిలా ఉంటే.. మొదటి సంవత్సరం బాపట్ల బీచ్ లో ఇసుకతో జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని చేయించారు తర్వాత సంవత్సరం జై జగనన్న వరికొత్తతో కోయించారు తర్వాత సంవత్సరం రావిఆకు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో గియించారు. ఇక ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి 175/175 సీట్ల లక్ష్యం సాధించాలని 175/175 జగనన్న అని వరి కోతతో కోయించి తన అభిమానాన్ని మరో సారి చాటుకున్నారు.

సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మేరుగు నాగార్జున, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని కేక్ నీ కట్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటూ వెంకటరెడ్డికి అభినందనలు తెలిపారు మంత్రి మేరుగు.

Back to Top