బ్రాహ్మణులపై కక్షసాధింపు చర్యలు తగదు

ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి

అర్చక, దేవాలయ వ్యవస్థలను కించపరుస్తున్నారు

వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే బ్రాహ్మణులకు మేలు

వైయస్‌ఆర్‌ సీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ కన్వీనర్లు కోన రఘుపతి, మల్లాది విష్ణు

అనంతపురం: చంద్రబాబు రాష్ట్రంలోని బ్రాహ్మణులపై కక్షకట్టారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ కన్వీనర్లు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, విజయవాడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. అనంతపురంలోని సూరజ్‌ గ్రాండ్‌ హోటల్‌లో వైయస్‌ఆర్‌ సీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కన్వీనర్లు కోన రఘుపతి, మల్లాది విష్ణు మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణుల స్థితిగతులు తెలుసుకుని వారి అభివృద్ధి తీసుకునే చర్యలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ఉంచుతారన్నారు. ఇది బ్రాహ్మణులకు శుభపరిణామమన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కులాలు, మతాలకు అతీతంగా అంతా అభివృద్ధి చెందారన్నారు. అయితే చంద్రబాబు మాత్రం బ్రాహ్మణుల విషయంలో కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐవైఆర్‌ కృష్ణారావు విషయంలో ఎలా వ్యవహరించారో రాష్ట్రమందరికీ తెలుసన్నారు. బ్రాహ్మణ  కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి తెలంగాణ వ్యక్తికి కట్టబెట్టారన్నారు. ఓటు బ్యాంకు కోసమే చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి అత్తెసరు నిధులు కేటాయించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రూ. వెయ్యి కోట్లతో ఫెడరేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు వారు వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ప్రతి బ్రాహ్మణుడు మెచ్చేలా కమిటీ నివేదిక ఉంటుందన్నారు. టీటీడీ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితుల విషయంలో సీఎం వ్యవహరించిన తీరు బ్రాహ్మణులు మరిచిపోరన్నారు. రాష్ట్రంలో అర్చక, దేవాలయ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. పెద్ద సంఖ్యలో ఆలయాలను  కూల్చివేశారని గుర్తు చేశారు. విజయవాడ అమ్మవారి గుడిలో క్షుద్రపూజలేంటని ప్రశ్నించారు. వీటిన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ‘నిన్ను నమ్మం బాబు’ అంటున్నారన్నారు. 

అర్చకులంటే అంత చులకనా?

అర్చకుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చాలా చులకనగా ఉందని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వివిధ సర్వేల్లో వైయస్‌ఆర్‌ సీపీ ముందుంజలో ఉండడంతో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. త్వరలోనే బ్రాహ్మణులకు మంచిరోజులు వస్తాయన్నారు. కమిటీ సభ్యుడు డాక్టర్‌ హెమ్మనూరు సుదర్శనశర్మ మాట్లాడుతూ.. రాయలసీమ జిల్లాలో బ్రాహ్మణులు 8 లక్షల ఓటర్లు ఉన్నారన్నారు. ఈ ప్రాంతం నుంచి ఒక అసెంబ్లీ టికెట్‌ కేటాయించే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణ సంఘాల నాయకులు రఘురామయ్య, జ్వాలాపురం శ్రీకాంత్, ప్రసాద్, తారానాథ్‌ శర్మ, మధుసూదన్, జ్వాలా నరసింహ, బీఎస్‌ఎన్‌ కుమార్, సురేష్, నిరంజన్‌శర్మ, శ్రీనివాసమూర్తి, నాగేష్, పురుషోత్తం పాల్గొన్నారు.  

తాజా వీడియోలు

Back to Top