వలంటీర్ల పనితీరు అద్భుతం

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: వలంటీర్ల పనితీరు అద్భుతమని, విపత్కర సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి వలంటీర్ల పనిచేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వలంటీర్లు, వార్డు సచివాలయ సిబ్బందికి నిత్యవసర సరుకులతో పాటు కూరగాయలను మంత్రి వెల్లంపల్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధ్యతగా పనిచేస్తున్న వార్డు వలంటీర్లకు మంచిచేయాలనే ఉద్దేశంతో పశ్చిమ నియోజవర్గంలోని వలంటీర్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వంతో పాటు అందరూ మేము సైతం అని ముందుకు కదలాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారన్నారు. సీఎం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది పేదలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేస్తున్నారని వివరించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top