వేదాద్రి రోడ్డు ప్రమాద మృతులకు రూ.5 లక్షల పరిహారం

మృతిచెందిన తెలంగాణ వాసులకు వర్తింపజేయాలని సీఎం ఆదేశం

తాడేపల్లి: జగ్గయ్యపేట మండలం వేదాద్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ట్రాక్టర్‌– లారీ ఢీకొన్న ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికీ ఎక్స్‌గ్రేషియా వర్తింపచేయాలని సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రమాదం జరిగినందున మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top