గుంటూరు దుర్ఘ‌ట‌న అత్యంత బాధాక‌రం

హ‌త్య‌కు గురైన ర‌మ్య మ‌త్య‌దేహాన్ని ప‌రిశీలించిన‌ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ  

గుంటూరు: గుంటూరు నగరం లో పట్టపగలు స్వాత్రంత్ర దినోత్సవం రోజున ఓ అమ్మాయిని దారుణంగా హ‌త్య చేసిన‌  దుర్ఘటన అత్యంత బాధాకరం, దురదృష్టక‌ర‌మ‌ని రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. కత్తిపోట్లతో దారుణ హత్య కు గురైన రమ్య మృత దేహాన్ని మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ ప‌రిశీలించి, నివాళుల‌ర్పించారు. అనంత‌రం గుంటూరు జిల్లా ఎస్పీ తో ఆమె మాట్లాడారు. మెడ పైన, పొత్తి కడుపులో ఆరు చోట్ల కత్తి తో తీవ్రంగా గాయపరచడం వల్ల రమ్య వెంటనే చనిపోయింద‌ని చెప్పారు.  పరిచయస్థుడే ఈ   ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది.  నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చూస్తామని వాసిరెడ్డి పద్మ బాధిత కుటుంబ స‌భ్యుల‌కు హామీ ఇచ్చారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top