వాసిరెడ్డి పద్మకు క్యాబినెట్‌ హోదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మకు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నియమితులయిన విషయం తెలిసిందే.  దీంతో ఈ నెల 26న తాడేపల్లిలోని సీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్లో వాసిరెడ్డి పద్మ పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాసిరెడ్డి పద్మకు కేబినెట్‌ హోదా రావడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Back to Top