ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలు

వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా నాయ‌కురాలు వాసిరెడ్డి పద్మ

కేసులుంటే పదవులని లోకేష్ చెబుతున్నాడు

మంగళగిరి వైయ‌స్ఆర్‌సీపీ నేత వెంకటరెడ్డిని ఢీకొట్టి చంపేశారు

ముఖ్యమంత్రిపై దాడి చేయమని ప్రోత్సహిస్తున్నారు

చంద్రబాబుకు అభివద్ధి.. పాలన చేయడం తెలుసా? 

తాడేపల్లి: టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే హత్యా రాజకీయాలకు పాల్పడుతోందంటూవైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా నాయ‌కురాలు వాసిరెడ్డి పద్మ
మండిపడ్డారు.  సాక్షాత్తూ సీఎంపై దాడి చేయించారని ధ్వజమెత్తారు. మంగళగిరి వైయ‌స్ఆర్‌సీపీ నేత వెంకటరెడ్డిని ఢీకొట్టి చంపేశారని, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, సానుభూతి పరులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ముఖ్యమంత్రిపై దాడి చేయమని ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు,లోకేష్ వ్యాఖ్యలు విద్వేషపూరితంగా ఉన్నాయి. కేసులుంటే పదవులని లోకేష్ చెబుతున్నాడు. ఓటమి అంచున ఉన్నారు కాబట్టే దాడులకు పాల్పడుతున్నారు. చంద్రబాబుకు అభివద్ధి.. పాలన చేయడం తెలుసా? పాలన చేతనైతే ఎందుకు ఐదేళ్లలో ఏం చేయలేకపోయారు? అంటూ వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.

  
వాసిరెడ్డి ప‌ద్మ ఏమ‌న్నారంటే..
ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్ది చంద్రబాబు,లోకేష్ లనుంచి వారి పార్టీ నేతలలో ప్రస్టేషన్ పెరిగిపోయిందని అందుకే హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు. మొన్నటికి మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిపైనే విజయవాడలో హత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు. పోలీసుల దర్యాప్తులో సైతం టిడిపి నేతల వెలుగుచూస్తోందని తెలియచేశారు.
 తాడేపల్లిలో తెలుగుదేశం నేతలు వైయ‌స్ఆర్‌సీపీ క్రియాశీలక కార్యకర్త వెంకటరెడ్డిని వాహనంతో గుద్దించి చంపేశారని అన్నారు. 
ఒంగొలు,చిత్తూరు,అన్నమయ్య జిల్లాల్లో వైయ‌స్ఆర్‌సీపీ  నేతలు,సానుభూతిపరులపై దాడులు చూస్తుంటే ఏ రకమైన ఎజెండాతో వెళ్తున్నారో అర్ధమవుతుందన్నారు. చంద్రబాబు ఇటీవల జగన్ గారిపై రాళ్ళతో కొట్టండని, మాడి మసైపోవాలంటూ టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగాలు చేస్తున్నారు. చంద్రబాబే కాదు లోకేష్ సైతం దాడులను ప్రోత్సహించేవిధంగా విద్వేషపూరితంగా మాట్లాడుతున్నారని అన్నారు.లోకేష్ అయితే ఎవరిపైన ఎన్నికేసులు పెట్టించుకుంటే వారికి తాను ప్రాధాన్యత ఇస్తానంటూ మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు.

    ప్రజలు వైయ‌స్ఆర్‌సీపీకి, వైయ‌స్ జగన్ గారికి బ్రహ్మరధం పడుతుంటడంతో ఏమి చేయాలో పాలుపోక ఓటమి అంచున నిలుచున్న టిడిపినేతలు దురుధ్దేశపూరితమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు.దాడులకు పాల్పడుతున్నారంటే వాళ్ళు యుధ్దం నుంచి పారిపోతున్నారని,పిరికిపందలు అని బావించాలని అన్నారు. వైయ‌స్ జగన్ గారు సిధ్దం అని ఎన్నికలకు వస్తుంటే కోట్లాదిమంది వచ్చి అభిమానం చూపుతుంటే తెలుగుదేశం పార్టీకి ఆదరణ కరువవడంతో దిక్కుతోచడం లేదని అన్నారు. మరోవైపు వైయ‌స్ జగన్ గారు మీ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో మంచి జరిగిందని బావిస్తేనే ఓటు వేయండని అడుగుతున్నారని తెలియచేశారు.ఆలూరు సభలో చంద్రబాబు ఐదేళ్లలో రాష్ర్టం సర్వనాశనం అయిందని అంటున్నారు.

సంక్షేమ పధకాలను,పరిపాలనను ఇంటింటికి తీసుకువెళ్లేలా సచివాలయ,వాలంటీర్ల వ్యవస్ధను ఏర్పాటులాంటి ఆలోచనలు మీకు ఎందుకు రాలేదు.పోర్టులను ఎందుకు అభివృధ్ది చేయలేకపోయారు.ఆస్పత్రులు,స్కూల్స్ వంటివి ఎందుకు డెవలప్ చేయలేదు.మీరు పరిపాలనలో చెప్పుకునేందుకు ఏమీ లేదు.అందుకే పచ్చమీడియాతో జగన్ గారిని బూచిలా చిత్రీకరించి మీరు ఏదో చేస్తున్నారంటూ ప్రచారం చేసుకోవడం మినహా మరోటి లేదు.వాటిని ప్రజలు నమ్మే పరిస్దితి లేదన్నారు.అందుకే చంద్రబాబు కూటమిని చూసి ఓటేయండని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.అభివృద్ది అంటే తెలియని వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మాటలకు ప్రజల నుంచి...టీడీపీ నాయకుల నుంచి స్పందన రావడం లేదు అన్నారు.ప్రజలు మీకు గుణపాఠం చెప్పడానికి సిధ్దంగా ఉన్నారని తెలియచేశారు.

Back to Top