వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన వంగా గీత, ఆదాల

హైదరాబాద్‌: ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలి. 13 జిల్లాలో ఏ నోట విన్నా ఇదే మాట వినిపిస్తుంది. ఎన్నికల సమీపిస్తుండడంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. అధికార పార్టీని వీడి వైయస్‌ జగన్‌ నాయకత్వంపై నమ్మకంతో నాయకులు వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగా గీత, టీడీపీ సీనియర్‌ నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి లోటస్‌పాండ్‌లో వైయస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. జననేత సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు.  

   

 

 

Back to Top