వైయస్‌ జగన్‌పై అభిమానం చాటుకున్న తెలుగు ప్రజలు 

ఇమామ్‌ పుస్తకాన్ని సీఎం వైయస్‌ జగన్‌కు అందించిన రమేశ్‌రెడ్డి
 

అమెరికా: అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్కడి తెలుగువారు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కదలిక పత్రిక సంపాదకుడు ఇమామ్‌... ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై "జనం గుండెల సవ్వడి జగన్‌'' పుస్తకాన్ని రచించారు. ప్రస్తుతం వాషింగ్టన్‌లో ఉన్న సీఎం వైయస్‌ జగన్‌కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నారై (యూఎస్‌) విభాగం గవర్నింగ్‌ కౌన్సిల్‌ సలహాదారు వల్లూరు రమేశ్‌రెడ్డి ఈ పుస్తకాన్ని అందజేశారు. 

Back to Top