అంగన్‌వాడీల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలం

 స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ 
 

అమ‌రావ‌తి: అంగన్‌వాడీల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంద‌ని, సమ్మె విరమించాల‌ని  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ విజ్ఞ‌ప్తి చేశారు.  అంగన్వాడీల సమస్యలపై సచివాయలంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. అంగ‌న్‌వాడీల‌ ఉద్యోగ విరమణ తర్వాత ఇచ్చే మొత్తాన్ని లక్షకు పెంచామని గుర్తు చేశారు. ఉద్యోగ విరమణ వయసును కూడా 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశామన్నారు. గతంలో తెలంగాణ కు సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరిన వెంటనే వేతనాలను రూ.11,500కు పెంచాం.. పదోన్నతి వయస్సును కూడా పెంచామన్నారు.
అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి ఉషశ్రీ చరణ్‌.. అర్హతను బట్టి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామని తెలిపారు.  అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టారంటూ జరుగుతోన్న ప్రచారంపై స్పందిస్తూ.. ఎవరూ అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టలేదని క్లారిటీ ఇచ్చారు. ఆయా జిల్లా కలెక్టర్ లు కేంద్రాలను నడిపేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు.  

Back to Top