బీసీల పల్లకి మోస్తున్న జ‌న‌నేత సీఎం వైయ‌స్ జగన్‌

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్‌ 
 

విజ‌య‌వాడ‌:  బీసీల పల్లకి మోస్తున్న జ‌న‌నేత సీఎం వైయ‌స్‌ జగన్‌ అని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్‌ పేర్కొన్నారు. పూలేకి సరిసమానమైన నేత వైయ‌స్ జగన్‌ అని ఆమె కితాబిచ్చారు. 139 కులాలకు రాజ్యాధికారంలో స్థానం కల్పించారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌ది. ఆయన్ని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత బీసీలదే అని ఈ సందర్భంగా మంత్రి ఉషా శ్రీ చరణ్‌ పిలుపు ఇచ్చారు.   వెనుకబడిన కులాలే వెన్నెముక! నినాదంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బీసీ మహాసభను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల నుంచి భారీగా బీసీ ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులు ఈ సభకు హాజర్యారు. బీసీల నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగిపోయింది. సభా ప్రాంగణంలో బీసీలతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. 

Back to Top