వైయ‌స్‌ జగన్‌కు యూఎస్‌ కాన్సులేట్‌ అభినందనలు

  అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుత్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖులతో పాటు దేశ వ్యాప్తంగా ప్రధానితో సహా పలువురు జాతీయ నేతలు కూడా వైయ‌స్‌ జగన్‌ను అభినందించిన విషయం తెలిసిందే.

తాజాగా అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కాథరీన్‌ హడ్డా వైయ‌స్‌ జగన్‌కు అభినందనలు తెలిపారు. ‘‘ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైయ‌స్‌ జగన్‌కు అభినందనలు. భవిష్యత్తులో అమెరికా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నా’’ అని ట్వీట్‌ చేశారు. గతంలో వైయ‌స్‌ జగన్‌తో దిగిన ఫోటోను ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు.  

 

Back to Top